ప్రేమంటే ఇదేరా : భార్య లేని వెలితి ఉండొద్దని మైనపు విగ్రహం చేయించిన భర్త

ప్రేమంటే ఇదేరా : భార్య లేని వెలితి ఉండొద్దని మైనపు విగ్రహం చేయించిన భర్త

భార్యపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు భర్త. ప్రమాదంలో చనిపోయిన భార్య లేని లోటును తీర్చుకోవాలని అనుకున్నాడు. వినూత్నంగా ప్రేమను చాటుకున్నాడు. తన కొత్తింటి ఇంట్లో భార్య ఉందనే విధంగా…మైనపు విగ్రహాన్ని తయారు చేయించారు.

ఆ విగ్రహానికి నగలు, ధరించి..మురిసిపోయాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆమె మైనపు విగ్రహం చూస్తే..ఆమె బతికే ఉందని అనుకుంటారు. అలా అనిపిస్తుంటుంది.
కర్నాటక రాష్ట్రంలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్త..ఇటీవలే విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో భార్య చనిపోయింది. భార్య చనిపోవడం తట్టుకోలేకపోయాడు. అప్పటికే కొత్తింట్లోకి ప్రవేశించాల్సి ఉంది. ఈ తరుణంలో భార్య బతికి ఉంటే ఎలా ఉండేదోనని ఆలోచించుకున్నాడు. అంతే..మైనపు విగ్రహం ప్రతిష్టించాలని అనుకున్నాడు.

భార్య మొహంలో చిరునవ్వు, సంప్రదాయం ఉట్టిపడేలా చీర కట్టు, బంగారు నగలు..ఇలా తన భార్య స్వరూపాన్ని మైనపు విగ్రహం ద్వారా ఆవిష్కరంచుకున్నాడు. ఇంట్లో ప్రతిష్టంచాడు. ఆ విగ్రహం వద్ ఆయన కుటుంబసభ్యులు ఫొటోలు దిగి..మురిసిపోయారు. బతికే ఉందా ? అనిపించేలా విగ్రహం ఉండడం చూసిన బంధువులు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమంటే ఇదేరా ? అంటున్నారు చాలా మంది.

Post a Comment

0 Comments