(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) కరోనా వ్యాధి విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నందున ప్రతి ఒక్కరూ వ్యాధి బారిన పడకుండా స్వీయ నియంత్రణ పాటించి, పోలీసు వారి సూచనలు సలహాలు పాటించాలని కరోనా వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు. మాస్కులు లేకుండా ఎవరు కూడా ఇళ్ళల్లో నుండి బయటకు రావద్దుని ,మోటార్ సైకిల్ పై ఒకరు మాత్రమే ప్రయాణించాలని, ప్రయాణించే సమయంలో తప్పకుండా హెల్మెట్ ,మాస్క్ ధరించాలని, ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే ఇద్దరు ప్రయాణించవచని,ఆటోలో ముగ్గురు మాత్రమే ప్రయాణించాలని ప్రయాణించే సమయంలో తప్పకుండా మాస్కులు ధరించాలని .నిత్యవసర కొనుగోలు గురించి కిరాణా షాపుల వద్ద కూరగాయల మార్కెట్ వద్ద మొబైల్ షాప్ ల వద్ద బస్టాండ్లలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, షాపుల యజమానులు శానిటైజర్ అందుబాటులో ఉంచాలని, షాపుల యజమానులు అందులో పనిచేసే వారు తప్పకుండా మాస్కులు ధరించాలని, కరోనా కు సంబంధించిన ఏవైనా లక్షణాలు కనబడగానే ప్రాథమిక దశలోనే టెస్టులు చేయించుకోవాలని పోలీస్ కమిషనర్ సూచించారు. కరోనా వ్యాధి సోకిన వారు హోమ్ క్వారంటైన్ లో ఉండి డాక్టర్ సలహాలు సూచనలు పాటించి, చికిత్స పొందవచని, రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం తీసుకోవాలని సూచించారు.ప్రజలు బ్యాంకుల వద్ద గుంపులుగుంపులుగా ఉండవదని, భౌతిక దూరం పాటించి క్యూలో నిలబడి కరోనా వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. పట్టణాలలో , మండల కేంద్రాలలో ఈరోజు నుండి కరోనా వ్యాధి నివారణ గురించి పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్, మరియు విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, ప్రభుత్వ సూచనలు సలహాలు జాగ్రత్తలు పాటించి కరోనా వ్యాధిని తరిమికొడదాంని, వీలైనంత వరకూ 10 సంవత్సరాలలోపు పిల్లలను 60 సంవత్సరాల పైబడిన వృద్ధులను ఇంటి నుండి బయటకు వెళ్లనియ్యవదని, మాస్కులు లేకుండా ప్రయాణించే వారిపై, రోడ్లపై తిరిగే వారిపై, బహిరంగ ప్రదేశంలో కనబడిన వారిపై కేసులు నమోదు చేసి 1000 రూపాయల జరిమానా విధించబడతయని. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై 100 రూపాయల జరిమానా విధించబడతయని , పై నియమనిబంధనలు పాటించి పోలీసు శాఖకు సహకరించాలని లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు.
0 Comments