విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడవద్దు : సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ డిమాండ్

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడవద్దు : సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ డిమాండ్

  • కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చేంతవరకు బడులు నడిపించోద్దు
(చట్టం - హుస్నాబాద్ / పిట్ల శ్రీనివాస్) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న విపత్కర పరిస్థితుల్లో పాఠశాలలను ప్రారంభిస్తా మంటూ రాష్ట్ర విద్యా శాఖ మాత్యులు సబితా ఇంద్రారెడ్డి ప్రకటించడం ఆశ్చర్యంగా,అనుమానంగా ఉందని భారత కమ్యూనిస్టుపార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేష్ అన్నారు మంగళవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ..  ఈ క్లిష్ట సమయంలో విద్యాసంస్థలను ప్రారంభించడం విద్యార్థుల, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం ఆడటమేనని ఆయన అన్నారు. కోవిడ్ 19 కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేయడానికి పకడ్బందీగా చర్యలు తీసుకోకుండనే టెస్టులు నామమాత్రంగా చేస్తుండడం వల్ల వైరస్ సరైన విధంగా కట్టడి చేయకుండానే పాఠశాలలు ప్రరంభిస్తామని అనడం శోచనీయమని గడిపె మల్లేశ్ ధ్వజమెత్తారు.
వ్యాక్సిన్ మందును ముందుగా విద్యార్థులకు అందజేయాలని
వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే విద్యపై ఏకాగ్రత కనబరుస్తారని అన్నారు .ఈ సమయంలో విద్యా సంస్థలను ప్రారంభించడం ద్వారా వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశముందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని గడిపె మల్లేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments