చిత్తూరు రైతుకు సోనూసూద్ ట్రాక్టర్ పంపడంపై ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం స్పందించారు. ఇకపై మిమ్మల్ని విలన్ పాత్రల్లో చూడలేనని.. సినిమాల్లో హీరో పాత్రలు వేయాల్సిందేనని ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
కరోనా కష్టకాలంలో అందరికీ హీరో అయ్యాడు సోనూ సూద్. వలస కార్మికులకు స్వస్థలాలకు పంపించడం మొదలుకొని.. చిత్తూరులో రైతు కుటుంబానికి ట్రాక్టర్‌ని పంపించడం వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎవరైన కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే స్పందిస్తాడు. కేవలం స్పందించడమే కాదు.. వీలైనంత త్వరగా వారికి సాయం అందేలా చేస్తాడు. రీల్ లైఫ్‌లో విలన్ అయినప్పటికీ.. రియల్ లైఫ్‌లో మాత్రం సూపర్ హీరోగా మారిపోయాడు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ రైతు కుటుంబానికి ట్రాక్టర్ అందించడంతో.. ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. చెప్పిన 5 గంటల్లోనే ఇంటికి ట్రాక్టర్ పంపించడంతో మీరు గ్రేట్ సార్.. సరిలేరు మీకెవ్వరు అంటూ ఆకాశానికెత్తుతున్నారు.
ఈ క్రమంలో ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం స్పందించారు. ఇకపై మిమ్మల్ని విలన్ పాత్రల్లో చూడలేనని.. సినిమాల్లో హీరో పాత్రలు వేయాల్సిందేనని ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలో ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం స్పందించారు. ఇకపై మిమ్మల్ని విలన్ పాత్రల్లో చూడలేనని.. సినిమాల్లో హీరో పాత్రలు వేయాల్సిందేనని ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

0 Comments