తెలుగు కవివరా అవార్డుకు ఎంపికైన కవి వరుకోలు లక్ష్మయ్య

తెలుగు కవివరా అవార్డుకు ఎంపికైన కవి వరుకోలు లక్ష్మయ్య


(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) : మల్లినాధసూరి కళాపీఠము తెలుగు కవివరా సాహిత్య వేదిక ఆద్వర్యంలో జరిగిన పలు ప్రక్రియ రచనలలో విశేష కృషి చేసినందుకు గాను కవి వరుకోలు లక్ష్మయ్య కు కవి చక్రవర్తి బిరుదుకు ఎంపికైనారని దృశ్యకవి అమరకుల, బాలసాహితీ వేత్త ఉండ్రాళ్ళ రాజేశం తెలిపారు. పద్యం, కవిత్వం, గేయం పలు ప్రక్రియలలో రచనలు చేస్తూ పుస్తకాలు ప్రచురించి, అనేక అవార్డులను పొందిన లక్ష్మయ్య కు కవి చక్రవర్తి బిరుదు రావడం పట్ల కవులు డాక్టర్‌ సామ సువర్ణాదేవి, సింగీతం నర్సింహారావు, జబర్దస్త్ లక్ష్మీ కిరణ్,  కోణం పర్శరాములు, బస్వ రాజ్ కుమార్, కమ్మరి శ్రీనివాసచారి, యం.డి ఉస్మాన్, ఆదిమూలం చిరంజీవి, తిరుపతి, అనిశెట్టి సతీష్ కుమార్, విజయకృష్ణ, రాచకొండ భూపాల్, మంచినీళ్ళ సరస్వతి, అన్నాడి జ్యోతిరెడ్డి, నిర్మల, రామానుజ, లక్ష్మీ, అనిత, అనురాధ తదితరులు అభినందనలు తెలిపారు.

Post a Comment

0 Comments