పవన్ క్రిష్ సినిమా టైటిల్ ఇదే.. బర్త్ డేకి ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్

పవన్ క్రిష్ సినిమా టైటిల్ ఇదే.. బర్త్ డేకి ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు సంబంధించిన మరో కొత్త అప్ డేట్ వచ్చింది. పవన్ క్రిష్ కాంబినేషన్‌లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. పవన్ సినిమా వస్తుందంటే చాలు.. టైటిల్ నుంచి ట్రైలర్ వరకు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. దీంతో పవన్ కొత్త సినిమాకు సంబంధించి ఆయన ఫ్యాన్స్ తమకు తోచిన టైటిల్స్‌ను డిజైన్ చేసి ప్రచారం కూడా చేస్తున్నారు.

.ఈ క్రమంలో క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించే చిత్రం టైటిల్ పట్ల కూడా అభిమానుల్లో ఎంతో ఆసక్తి, కుతూహలం నెలకొన్నాయి. అయితే పవన్ కొత్త సినిమా టైటిల్‌ను ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 2న ప్రకటించనున్నట్లు సమాచారం. డైరెక్టర్ క్రిష్ అదే రోజు కొత్త సినిమా టైటిల్ ప్రకటిస్తారని తెలుస్తోంది. టైటిల్ అనౌన్స్ మెంట్ కి హీరో బర్త్ డేను మించిన రోజు మరొకటి ఉండదని, ప్రేక్షకులలోకి బాగా చొచ్చుకుపోతుందని ఆయన భావిస్తున్నారు. ఆ రోజు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేస్తారని సమాచారం.

Post a Comment

0 Comments