కరోనా రికవరీ రేటులో భారత్ మంచి స్థానంలో ఉందని ప్రధాని మోదీ అన్నారు. కిందిస్థాయిలో వైద్య ఆరోగ్య వ్యవస్థ వల్లే ఇది సాద్యమైందని అభిప్రాయపడుతూ.. భారత దేశ ప్రజల ఉద్యమంగా కరోనాపై పోరాడుతున్నామన్నారు. శుక్రవారం ఆయన ఐక్యరాజ్య సమితి వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి కొవిడ్-19 తర్వాత ఐరాస పాత్రపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసగించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 10లక్షలను దాటగా.. శుక్రవారానికి కోలుకున్న వారి సంఖ్య 6.36కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన రికవరీ రేటును ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘కరోనా మహమ్మారి అనేక దేశాల సామర్ధ్యానికి తీవ్రమైన పరీక్ష పెట్టింది. భారత్‌లో కరోనా కష్టకాలంలో పేదలను అదుకునేందుకు రూ.2,248 కోట్లను వెచ్చించాం. ప్రతికూల పరిస్థితులను అనూకూలంగా మలుచుకుంటూ.. ఆత్మనిర్భర్ భారత్‌కు నాంది పలికాం. ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టే చర్యలను ప్రారంభించాం. ఇతర అభివృద్ది చెందుతున్న దేశాలకు కూడా సహాయం చేశాం. మా నినాదం ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్’. కరోనా కల్లోలం నేపధ్యంలో 150 దేశాలకు ఔషద సాయం చేశాం’’ అని వ్యాఖ్యానించారు.
0 Comments