నూతన విద్యా విధానాన్ని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ఇది మంచి నిర్ణయమని.. నూతన విద్యా విధానంతో విద్యా రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.
ఉద్దేశ్యంతో నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. 30 ఏళ్ల నాటి విద్యా విధానాన్ని స్వస్తిచెప్పి కొత్త విద్యా విధానానికి కేంద్రకేబినెట్ ఆమోద ముద్రవేసింది. దీన్ని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ఇది మంచి నిర్ణయమని.. నూతన విద్యా విధానంతో విద్యా రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. యువత ప్రపంచంతో పోటీపడేలా బాటలు వేస్తుందని అభిప్రాయపడ్డారు. 5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యను బోధించడం వల్లే విద్యార్థుల ఆలోచనా విధానం మెరుగవడంతో పాటు విద్యా నైపుణ్యాలు పెరుగతాయని అన్నారు.
0 Comments