ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. కరోనా రోగులను ఆదుకోవడంలో ఓ సలహా ఇచ్చారు. కరోనా రోగులకు సహాయం చేసేందుకు రాష్ట్రంలోని ఫంక్షన్లను స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. వాటి నిర్వహణ బాధ్యతలను ఎన్జీవోలు, ట్రస్టులకు అప్పగించాలని సూచించారు. ఆ ఫంక్షన్ హాల్స్ ఖర్చులను ఎన్జీవోలు, ట్రస్టులు భరిస్తాయని, ప్రభుత్వం నుంచి వైద్యులు, వైద్య సిబ్బందిని కేటాయిస్తే సరిపోతుందన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో జైన్ సంఘం ఓ ఫంక్షన్ హాల్ తీసుకుని 60 పడకలతో కరోనా సెంటర్‌ను నడుపుతుందనే విషయాన్ని లేఖలో ఉండవల్లి ప్రస్తావించారు. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలకు అనుమతించి ఫీజును ప్రభుత్వం నిర్ణయించాలన్నారు. ప్రస్తుతం డబ్బు, పలుకుబడి ఉంటేనే కరోనా నుంచి బయటపడగలమనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారని, అలాంటి భావన నుంచి వారిని బయటపడేయాలన్నారు.
0 Comments