సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై సర్వే


(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) : నారాయణరావుపేట గ్రామంలో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రేవంత్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో రెవెన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు భూ సమస్యలు ఎదుర్కొంటున్నారని, అలాగే గ్రామంలో ఎస్సి, ఎస్టీ, బిసి కమ్యూనిటీ భవనాలు కొన్ని పిలర్ల స్థాయిలో, కొని స్లాబ్ స్థాయిలో నిలిచి పోయాయని, అన్నారు. గ్రామంలో గ్రామ పంచాయితీ భవనానికి 2017 డిసెంబర్ లో శంకుస్థాపన చేశారు కానీ నేటికీ పూర్తికాలేదు. మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పక్కభవనం లేక ప్రజలు తమ సమస్యలను ఎక్కడికి వెళ్లి చెప్పుకోవాలని అక్కడి వెళ్ళితే అక్కడ ప్రజాప్రతినిధులు, కానీ అధికారులు కానీ అందుబాటులో ఉండరని ఆవేదన వ్యక్తం చేయడం జరిగిందని అన్నారు. ఇలా భవనాలు ఏండ్ల తరబడి పెండింగులో ఉన్నా కంట్రక్టర్ పై  చర్యలు చేపట్టవలసిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని దుయ్యబట్టారు. మండల కేంద్రంలో ఇప్పటివరకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిచకపోవడం శోచనీయమని ఇప్పటికైనా డబుల్ బెడ్ రూం ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, లబ్దిదారులకు ఇల్లు కేటాయింపు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులు కరోన విజృబిస్తున్న విధులు నిర్వహిస్తున్న కొత్త సర్పంచ్ లు వచ్చినప్పటి నుండి యూనిఫామ్స్ ఇవ్వకపోగా, జీఓ 51 పేరుతో కార్మికులతో అధికారులు, ప్రజా ప్రతినిధుల వేధింపులు అధికమయ్యాని, కరోన సేఫ్టీ పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మద్యాహ్నం భోజనం పథకంను విద్యార్థులకు అందివ్వాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కరోనా పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయిన ప్రతి కుంటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలని, ఉపాధి పని దినాలు 200 రోజులకు పెంచాలని, రేషన్ కార్డు లేని వారికి 10 కిలోల రేషన్ బియ్యం, నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ తునికి మహేష్, గ్రామ నాయకులు శ్రీకాంత్, రాజేష్, లచ్చయ్య, భవన నిర్మాణ, గ్రామ పంచాయతీ, హమాలి, ‌ట్రాన్స్‌పోర్ట్ ఆటో, వ్యవసాయ, కార్మికులు, రైతులు తదితరులు పాల్గున్నారు.
                           
Reactions

Post a Comment

0 Comments