నూతన విద్యా విధానం ప్రైవేటు కార్పొరేటు సంస్థలను ప్రోత్సహించేది గా ఉంది ..టి .పి .టి. ఎఫ్.

(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం స్వదేశీ పేరు చెప్పుకుని ,విదేశీ విద్యా విధానాన్ని ప్రోత్సహించే విధంగా ,ప్రైవేటు ,కార్పోరేట్ విద్యాసంస్థలు అభివృద్ధి చెందే విధంగా ఉందని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ,రాష్ట్ర ఉపాధ్యక్షులు జి .తిరుపతిరెడ్డి ,రాష్ట్ర కార్యదర్శి ,ఎస్ .కనకయ్య ,జిల్లా ప్రధాన కార్యదర్శి కే .రామస్వామి ఒక ప్రకటనలో తెలిపారు.  భవిష్యత్తులో ప్రజల మధ్య అంతరాలు పెంచేదిగా ఉందని విద్యారంగాన్ని ప్రభుత్వం బాధ్యతాయుతంగా నిర్వహించే బదులు ప్రైవేట్ ,కార్పొరేటు సంస్థలకు అప్పజెప్పడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు .ఐదవ తరగతి వరకు మాతృభాషలోనే విద్య కొన సాగే ట్లు స్పష్టత ఇవ్వలేదన్నారు .రాష్ట్ర ప్రభుత్వానికే అప్పజెప్పడం సరైంది కాదన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలలో ఒకే రకంగా మాతృభాషలోనే విద్య సాగేలా స్పష్టత ఇవ్వాలన్నారు. 3 ,5 ,8 తరగతులకు పరీక్షలు పెట్టడం డిటెన్షన్ విధానాన్ని అమలుపరచడం అవుతుందన్నారు. దీనివల్ల పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతారు ,వృత్తి విద్యను సెకండరీ స్థాయి నుండి అమలు చేస్తే చదువు ముగిసిన తర్వాత ఉపాధి పొందుతారు .పూర్వ ప్రాథమిక పాఠశాలలో 1 :10 ,ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 1:20 ,ఉన్నత పాఠశాలలో 1:30 ఉపాధ్యాయ ,విద్యార్థి నిష్పత్తి తో ఉండాలని ,తరగతి కో క గది , తరగతికి ఒక ఉపాధ్యాయుడు , ఉండేవిధంగా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ,అందరికీ ఒకే రకమైన కామన్ స్కూల్ విధానం తీసుకురావాలని కోరారు .3 నుండి 18 సంవత్సరాల వయసు వరకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం స్వాగత్ ఇస్తున్నామన్నారు . ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించడాని,మధ్యాహ్న భోజనం తో పాటు అల్పాహారాన్ని అందించేందుకు నిర్ణ హించడాన్ని స్వాగత్ ఇస్తున్నామన్నారు .5 +3 +3+4 విధానం ఆహ్వానించదగిన దని ,కొటారి సూచనల మేరకు విద్యకు జీడీపీలో 6 శాతం నిధులు కేటాయించి , ఆచరించే విధంగా నిర్ణయాలు ఉండాలని సూచించారు .నూతన విద్యా విధానం రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఉండొద్దని ,శాస్త్రీయ, లౌకిక ,ప్రజాస్వామిక , నైతిక విలువల్ని పెంపొందించే విధంగా ఉండాలని అన్నారు. విద్యాలయాల్లో మౌలిక వసతులపై స్పష్టత ఇవ్వలేదన్నారు.
Reactions

Post a Comment

0 Comments