రైతు జీవితానికి తెలంగాణ ప్రభుత్వం భరోసా..
- అధిక సాగు, ఆదాయం వచ్చేలా..
రైతులు పంటలు సాగు చేయాలని రైతులకు పిలుపు.
మండల కేంద్రమైన చిన్నకోడూర్ మార్కెట్ కమిటీ ఆవరణలో రైతు వేదిక భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన తర్వాత చిన్నకోడూర్ లోని బెల్లంకుంట చెరువు నిండి మత్తడి దూకిన సందర్భంగా గోదావరి జలాలను ఆహ్వానిస్తూ.., చెరువు గంగమ్మ తల్లికి జల హారతి పట్టి స్వాగతించడం జరిగింది. అనంతరం పెద్ద చెరువులో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో కొర్ర మట్ట చేపలను వదిలి, పెద్ద చెరువు కట్టపై ఉన్న శ్రీ గంగా భవాని దేవాలయంలో గంగమ్మ తల్లికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు..
- రైతుకు బతుకు మీద ప్రభుత్వం భరోసా కల్పించింది.
రాష్ట్ర వ్యాప్తంగా కోటిన్నర లక్షల ఏకరాలకు రైతుబంధు అందిస్తున్నాం.
వానా కాలం రూ.7 వేల కోట్లు, యాసంగిలో రూ.7 వేల కోట్లు రైతుకు పెట్టుబడి సాయం కింద అందిస్తున్నాం.
- కరోనా వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంగదీస్తున్న రైతులకు ఏ లోటు రానివ్వమని, అన్నీ రకాలుగా తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆడుకుంటుంది.
- చిన్నకోడూర్ పెద్ద చెరువును మినీ ట్యాoకు బండ్ గా మారుస్తా.
- అధిక సాగు, అధిక ఆదాయం వచ్చేలా రైతులు పంటలు సాగు చేసి పుట్ల కొద్దీ వడ్లు పండించాలి.
- ప్రభుత్వం సూచించిన ప్రాధాన్య పంటలు సాగుచేసి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలి.
- గుంట భూమి కూడా ఖాళీగా ఉండకుండా.. పంటల సాగుతో కళకళలాడాలి.
0 Comments