అన్నదాతలను అన్ని విధాలుగా ఆదుకుంటాం.!

telugu news,telangana news,chattam telugu

- నష్టపోయిన పంటలపై నివేదిక తయారు చేయాలని అధికారులకు ఆదేశం
- నివేదిక రాగానే ప్రభుత్వం ద్వారా రైతులకు సాయం అందిస్తామని మంత్రి హరీష్ రావు హామీ

 వడగళ్ల వానకు నష్టపోయిన అన్నదాతలను అన్ని విధాలుగా ఆదుకుంటాం.! అండగా ఉంటామని, అధైర్య పడొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు రైతులకు భరోసా కల్పించారు. సిద్ధిపేట జిల్లాలో అకాల వర్షాలు కురిసి వందల ఎకరాల్లో వరి పంటలకు తీరని నష్టం వాటిల్లింది. నీటికి ధాన్యం తడిసి పోయి రైతులు తీవ్ర ఆవేదనను మంత్రి హరీశ్ రావుతో వెలిబుచ్చారు. ఈ మేరకు ప్రధానంగా జిల్లాలోని కొమురవెళ్లి, నంగునూరు మండలాల్లోని గౌరాయపల్లి, కిష్టంపేట, తిమ్మాయిపల్లి మరియు కొండపాక మండలం దర్గా గ్రామాలలో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ కురిసిన వడగళ్ల వర్షానికి వందల ఎకరాల్లో వరి పంటలు నష్టం వాటిల్లిన పంటలను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యం కారణంగా అకాల వర్షాలు, వడగండ్ల వాన పడటంతో పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం జరగడం బాధాకరమన్నారు. నష్టపోయిన పంటలపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందచేయాలని వ్యవసాయం, ఉద్యానవన, రెవెన్యూ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. నివేదిక రాగానే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా రైతులకు సాయం అందిస్తామని మంత్రి హామీనిచ్చారు. మంత్రి వెంట మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Reactions

Post a Comment

0 Comments