నిజామాబాద్ (చట్టం) : కరోనా వ్యాధి అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నేపధ్యంలో స్వంత ఊరికి దూరమైన వలస కూలీలకు, రేషన్ కార్డులేని నిరుపేదలకు ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్త చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త నేతృత్వంలో ఉచితంగా పదిరోజులకు సరిపడే నిత్యావసర సరుకులు నగరంలోని కార్పోరేషన్ పరిధిలోని డివిజన్లవారిగా, నేరుగా అందిస్తున్నారు.
ఇప్పటి వరకు దాదాపు వెయ్యికి పైగా కిట్లను పేదలకు పంపిణి చేశారు. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 5వ తేదిన రాత్రి 9గంటలకు 9నిమిషాల పాటు ఇంట్లో విద్యుత్ దీపాలు ఆర్పివేసి జ్యోతులు, క్యాండిల్, టార్చ్‌లైట్, సెల్ లైట్ల వెలుతురులో 130కోట్ల జనాభా ఐక్యత చాటి ఏకతాటిపై నిలిచి భయంకరమైన కరోనా మహమ్మారిని తరిమివేద్దామని పిలుపు నిచ్చారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, 20సెకన్ల పాటు సబ్బుతో చేతులు కడుక్కొవాలని సూచించారు.
0 Comments