:ఇతర దేశాల నుంచి స్వదేశానికి వచ్చిన వారికి కరోనా వైరస్ గురించి కౌన్సిలింగ్

nizamabad news

కామారెడ్డి (చట్టం) : నసురుల్లాబాద్ మండల కేంద్రంతో పాటు అంకొల్, బొమ్మదేవ్ పల్లి, సెంగెం గ్రామాల్లో పర్యటించి వైద్య బృందం వీరికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. డాక్టర్ మెడికల్ ఆఫీసర్ రవి రాజా మాట్లాడుతూ. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి దగ్గు, జ్వరం, జలుబు, తుమ్ములు ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే స్థానికంగా ఉండే ఏఎన్ఎంకు సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు. నసురుల్లాబాద్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి అవగాహన కల్పించడం జరిగింది.
People Also Read:జాగ్రతలు పాటించని మున్సిపల్‌ ‌పారిశుద్ద్య సిబ్బంది

ఇప్పటి వరకు మండలంలో 18 కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. వీటిలో పది కేసులను విజిట్ చేయడం జరిగిందన్నారు. వీరి వెంట ఉన్న వారు ఆర్ బి ఎస్ కె మెడికల్ ఆఫీసర్, సి సి ఇంతియాజ్ అలీ, ఏఎన్ఎం సప్న, నసురుల్లాబాద్ గ్రామ సర్పంచ్ అరిగే సాయిలు, ఆశా వర్కర్ లావణ్య తదితరులు ఉన్నారు.
Reactions

Post a Comment

0 Comments