నిజామాబాద్ (చట్టం) : నగర ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ద్య సిబ్బంది ప్రస్తుత తరుణంలో జాగ్రత పాటించకపోవడం ఆందోళనను కలిగిస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకుండానే విదులను నిర్వహిస్తూ వీధులలో చెత్తను సేకరిస్తున్నారు. ఒక వైపు కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో అందరు జాగ్రతలు పాటించాలని చెబుతున్న మున్సిపల్ అధికారులు తమ సిబ్బందికి గ్లౌజులు, మాస్కులు అందిచక పోవడం శోచనీయం. ఎమర్జెన్సీ పనులు చేసే పారిశుద్ద్య సిబ్బందికి మాస్కులు, గ్లౌజ్‌లు అందించి వారికి తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

0 Comments