మాస్కు ధరించకుండా వచ్చాడని దాడి

రాయదుర్గం (చట్టం) : మాస్కు ధరించకుండా వచ్చాడని వినియోగదారులు దాడి చేసిన సంఘటన సోషన్‌ ‌మీడియాలో వైరల్‌గా మారింది. కొండాపూర్‌ ‌హెరిటేజ్‌ ‌సూపర్‌ ‌మార్కెట్‌లో ఈ ఘటన జరిగింది. అయితే ఈ వీడియో సోషల్‌ ‌మీడియాలో హల్‌చల్‌ ‌చేసింది. సోషల్‌ ‌మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందని, ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఇన్స్‌పెక్టర్‌ శ్రీ‌నివాస్‌ ‌వివరించారు. ప్రజలు ఎవరు తమకు తాముగా ఇలాంటి దాడులకు పాల్పడవద్దని, ప్రభుత్వ సూచనలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Reactions

Post a Comment

0 Comments