దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులకు ఆదుకునేందుకు సామాజిక బాధ్యతగా ఒకరు ముందుకు వచ్చి సహకరించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి . బిజెపి జాతీయ నాయకత్వం పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితుల్లో పేదవారి ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరు ఐదుగురి వ్యక్తులకు తగ్గకుండా ఆహారం అందించేందుకు బిజెపి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఈ సందర్భంగా కరీంనగర్ లోని వివిధ ప్రాంతాల్లో ఆహార పదార్థాలను అన్నార్తులకు ఆయన స్వయంగా అందించారు. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక కార్యకర్తలు వివిధ సంస్థల ప్రతినిధులు బాధ్యతగా విధిగా పేదలకు ఆహారాన్ని అందించే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఏప్రిల్ 14 వరకు కొనసాగుతున్న కరోనా వైరస్ నివారణ చర్యలకు ప్రజలంతా సహకరించాలని, ఇంటి వద్దే ఉండాలని బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
#IndiaFightsCorona #LetsFeedThePoor
0 Comments