58‌వ డివిజన్‌లో ముమ్మర ప్రచారం నిర్వహించిన టిఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎం.ఎ.ఖుద్దూస్‌

58‌వ డివిజన్‌లో ముమ్మర ప్రచారం నిర్వహించిన టిఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎం.ఎ.ఖుద్దూస్‌

నిజామాబాద్‌ (‌చట్టం న్యూస్‌): ‌నిజామాబాద్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిదిలోని 58వ డివిజన్‌ ‌నుండి టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆభ్యర్థిగా బరిలో ఉన్న మాజి కార్పోరేటర్‌, ‌మైనారిటి, టిఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు లైన్‌గల్లి, దారుగల్లి, బర్కత్‌పుర తదితర 58వ డివిజన్‌ ‌పరిధిలో ముమ్మర ప్రచారం నిర్వహించారు.
58వ డివిజన్‌ ‌ప్రజలు ఎం.ఎ.ఖుద్దూస్‌కు బ్రహ్మరథం పట్టారని ఆయన తెలిపారు. 58వ డివిజన్‌లో ఎం.ఎ.ఖుద్దూస్‌ ‌గెలుపు ఖాయం అని ప్రజలు, నాయకులు ఆశాభావం వ్యక్తం చేసారు. గతంలో కౌన్సిలర్‌గా, కార్పోరేటర్‌గా ముఖ్యంగా మైనారిటీలకు అశేష సేవలను అందించానని, ప్రభుత్వ పథకాలు ప్రతి మైనారీటి గడపగడపకు చేర్చానని, ప్రజలు టిఆర్‌ఎస్‌ ‌పార్టి పట్ల అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారని అన్నారు.
గతంలో సాధించిన మెజారిటి కంటే రెట్టింపు మెజారిటి మరోసారి గెలిపిస్తారని పూర్తి విశ్వాసం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ ‌మైనారీటి కార్యకర్తలు పర్వేజ్‌ఖాన్‌, అక్తర్‌హమద్‌, ‌తదితరులు పాల్గొని దుకాణం దుకాణంకు ప్రచారం చేసారు.

Post a Comment

0 Comments