ChattamTelugu:అచ్చంగా అనుష్కలా ఉందే! ‘ఇప్పుడు మిగతా ఐదుగుర్ని వెతకాలి’:Anushka Sharma

ChattamTelugu:అచ్చంగా అనుష్కలా ఉందే! ‘ఇప్పుడు మిగతా ఐదుగుర్ని వెతకాలి’:Anushka Sharma

OMG YES!! I've been looking for you and the remaining 5 of our dopplegangers all my life

మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని చెబుతారు. ఏడుగురు ఒకరికొకరు ఎదురు పడతారో లేదో తెలీదు కానీ ఓ ఇద్దరు మాత్రం ఏదో ఒక సందర్భంలో కలిసే ఛాన్స్ లేకపోలేదు. ఈ తరహాలో పోలికలు ఉన్నాయంటూ ఫోటోల ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఎందరో సెలబ్రిటీలు ట్విన్ లుక్ తో ఫోటోలు అంతర్జాలంలో అందుబాటులోకి వచ్చాయి. ఆ ఇద్దరి పోలికల్ని చూసుకుని మురిసిపోవడం అభిమానుల వంతు అవుతోంది.
Anushka Sharma,latest Anushka Sharma latest photos,anushaka sharma hot videos,anushka sharma affairs

గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో అనుష్క శర్మ, అమెరికన్‌ సింగర్‌ జూలియా మైకేల్స్‌ ఫోటోలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దాంతో నెటిజన్లు వీరిద్దరి ఫొటోలను పక్కపక్కన పెట్టి ‘అనుష్కా(anushka sharma).. నీకు చెల్లి ఉందా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఈ ఫొటోను అనుష్క, జూలియాలు కూడా చూశారు.

దాంతో జూలియా వెంటనే అనుష్కకు ట్విటర్‌లో ఈ ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘హై అనుష్క.. మనమిద్దరం కవలలమట..’ అని సరదాగా మెసేజ్‌ పెట్టారు. అందుకు అనుష్క స్పందిస్తూ.. ‘ఓ మై గాడ్‌ నిజమే! నువ్వు కనిపించావు. ఇప్పుడు నాలా ఉన్న మరో ఐదుగురి కోసం వెతకాలి’ అంటూ సరదగా రిప్లై ఇచ్చారు అనుష్క. వీరిద్దరి మధ్య జరిగిన ట్విటర్‌ సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

Post a Comment

0 Comments