"కల్తీ వ్యాపారుల వెన్నులో వణుకుపట్టించిన ఈ IAS ఆఫీసర్ కి సెల్యూట్.
|
(చట్టం- కరీంనగర్): 15 నెలలు అంటే, ఏడాదికన్నా మూడు నెలలు ఎక్కువ సమయం..
ఒక్క ఏడాదిలో ఒక రాష్ట్రంలో ఏ విషయంలో అయినా సమూలంగా మార్పులు తేవడం సాధ్యమా?
దాదాపు అసాధ్యం అయిన ఈ అద్భుతాన్ని ఒక మహిళా ఐఎఎల్ అధికారి సుసాధ్యం చేసి చూపారు. కేవలం 15 నెలలల్లో కేరళ ప్రజలఆహారంలో విప్లవాత్మక మార్పు తెచ్చారు. 2010 సివిల్స్ పరీక్షలలో జాతీయస్థాయిలో 4వ ర్యాంక్ సాధించిన టివి అనుపమ , కేరళలలోఆహార కల్తీలపై ఉక్కుపాదం మోపారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న ఏడాది కాలంలో ఆరువేల ఆహార సాంపిల్స్ సేకరించి, పరీక్షలకి పంపడంతో పాటు,750 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేయించారు. దీనితో కల్తీ వ్యాపారుల వెన్నులో వణుకుపట్టింది. ఆహార కల్తీలు దాదాపుగా ఆగిపోయాయి.
అంతేకాదు కూరగాయల్లో ప్రమాదకర స్థాయిలో పురుగుమందుల అవశేషాలు ఉన్నాయని అనుపమ కనుగొన్నారు. దాదాపు 300శాతం అధికమోతాదులో సెప్టిసైడ్అవశేషాలు ఉన్నాయని అనుపమ వెలుగులోకి తెచ్చారు. కేవలం సమస్యలని హైలైట్ చేయడమే కాదు, పరిష్కారం దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. అనుపమ. కేరళ ప్రజలకి అవసరమైన కూరగాయల్లో 70శాతం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రా నుంచి దిగుమతి చేసుకునేవారు. ఈ రాష్ట్రలలో కూరగాయల సాగులోక్రిమిసంమారక మందులు విచ్చలవిడిగా వాడటంతో పాటు, కూరగాయలు మంచి రంగు రావడానికి, ఎక్కువ రోజులు నిల్వ ఉ ండటానికి రసాయనాలు వాడుతున్నారు.
అందుకే మన కూరగాయలు - మనమే పండించుకుంటే ఆరోగ్యం బాగుండడంతో పాటు బోలెడుడబ్బు ఆదా అవుతుందని అనుపమ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. సోషల్ మీడియా ద్వారా అనుపమ చేసిన ఈ ప్రచారానికి అద్భుత స్పందన లభించింది. అనుపమ మొదలు పెట్టిన ఈ ప్రచారాన్ని కేరళరాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్ళింది. కూరగాయలు పండించేందుకు అవసరమైన విత్తనాలు, నార్లు (సాఫ్టింగ్స్) ఉచితంగా ఇవ్వడంతో పాటు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సబ్సిడీపై అందించింది.
దీనితో కేరళ ప్రజలు తమ ఇల్ళ పెరడు, ఇంటిముందున్న ఖాళీ స్థలాలలో కూరగాయలు పండించడం మొదలు పెట్టారు. ఈ మార్పు కొన్ని వందలు, వేల మందిలో కాదు, లక్షల మందిలో ఈ మార్పు వచ్చింది. ఒకప్పుడు 70శాతం కూరగాయలుదిగుమతి చేసుకున్న కేరళ, ఇప్పుడు 70శాతం కూరగాయలని సొంతంగా పండించుకుంటోంది. ఇది కేవలం 15నెలలో వచ్చిన మార్పు . మొక్కవోని దీక్షతో అనుపమ సాధించిన మార్పు. మన తెలుగురాష్ట్రాలలో కూడా ఆహార కల్తీలు భారీ స్థాయిలో ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా అనేక సందర్భాలలో ఆహార కల్తీలపై ఆవేదన వ్యక్తం చేశారు.
ఈలాంటి అధికారులని మన తెలంగాణ ప్రభుత్వాలైతే ఉండనిస్తాయా?"
తెలుగు రాష్ట్రాల అధికారులు కూడాఅనుపమని స్ఫూర్తిగా తీసుకుని కల్తీలపై ఉక్కుపాదం మోపాలని కోరుకుందాం.కొసమెరుపు: సోషల్ మీడియా ద్వారా ఇంత పెద్ద మార్పుసాధించిన అనుపమ కి ట్విటర్ అకౌంట్ లేదు, పర్సనల్ ఫేస్ బుక్ పేజ్ లో యాక్టివ్ గా కూడా ఉండరు. కేవలం ప్రభుత్వ వెబ్ సైట్స్, ఫేస్ బుక్ పేజీలలో ఆసక్తికర సమాచారాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేయడంద్వారా ఆమె ఈ మార్పు సాధించారు.



0 Comments