‘షూ’లో పాము.. 9వేల మైళ్ల జర్నీ.. ఓ మహిళకు భయానక అనుభవం...

‘షూ’లో పాము.. 9వేల మైళ్ల జర్నీ.. ఓ మహిళకు భయానక అనుభవం...

Nizambad News,Telugu News,Telangana News

ఎడిన్బర్గ్‌: విహార యాత్ర ముగించుకుని ఇంటికి చేరుకున్న ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది.

 ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఇంటికి చేరుకున్న మోయిరా బాక్సాల్‌ అనే మహిళ.. తన సూట్‌కేసులోని ఓ ‘షూ’ లో దాగిన పామును చూసి షాక్‌కు గరయింది. స్నేక్స్‌ ఆన్‌ ప్లేన్‌ చిత్రంలో మాదిరి.. ఆ పాము విమానంలో దాదాపు 9 వేల మైళ్ల దూరం ప్రయాణించింది. మోయిరా, క్వీన్స్‌లాండ్‌ నుంచి గ్లాస్గో వరకు ప్రయాణించే అంతసేపు పాము షూలోనే నక్కి ఉండటంతో దాని చర్మపు పై పోర ఉడిపోయింది. 

Telangana News,Telugu News,Latest News
వెంటనే ఈ విషయాన్ని మోయిరా జంతు సంరక్షణ సంస్థకు తెలియపరిచింది. వెంటనే రంగంలోకి దిగిన వారు ఆ పామును షూ నుంచి జాగ్రత్తగా బయటకు తీశారు. అయితే పాము విషపూరితమైన కాదని వారు చెప్పారు. గతంలో కూడా పాములు విమానంలో నక్కి ప్రయాణించిన ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

Post a Comment

0 Comments