(చట్టంతెలుగు :)మెల్బోర్న్ వెరైటీ అంటూ వింత వేషాలు వేస్తె ఏమవుతుందో
చూపే ఘటన .కొత్తగా
![]() |
| Add caption |
ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఓ మహిళ కొనుగోలు చేసిన డ్రస్.. చివరికి
ఆమె భర్త చేతుల్లో కాలు విరగొట్టుకునేలా చేసింది. ఆస్ట్రేలియాలోని
మెల్ బోర్న్లో చోటుచేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వెరైటీగా
ఉంటుంది కదా అనుకుని ఆమె పాముల డిజైన్లతో ఉన్న లెగిన్స్ (కాళ్లను
అంటిపెట్టుకుని ఉండే పొడవైన స్టాకింగ్స్ ను కొనుగోలు చేసింది. తన
భర్తను సరదాగా ఆటపట్టించడం కోసం రాత్రి ఆ లేగిన్స్ ధరించి నిద్రలోకి జారు కుంది. పడక
గదిలోకి వెళ్లిన భర్త.. చీకట్లో
ఆమె కాళ్లను చూసి బెడ్ మీదకు పాములు వచ్చాయని అనుకుని కంగారుపడ్డాడు
అలికిడి చేయకుండా
బేస్బాల్
బ్యాట్ తెచ్చి ఆమె కాళ్ల మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు ఆమె కెవ్వున కేక పెట్టింది పామును చూసి ఆమె కేకలు పెడుతోందనుకుని ఇంకో రెండు తగిలించాడు. "అవి పాములు కాదు, నా కాళ్లు" అని ఆమె గట్టిగా కేకలు పెట్టింది. దీంతో భర్త లైటు వేసి అసలు విషయం తెలుసుకున్నాడు. అతను కొట్టిన దెబ్బలకు ఆమె కాళ్లకు గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బ్యాట్ దెబ్బకు కాలు విరిగినట్లు వైద్యులు చెప్పారు. ఆమె చేసిన పనికి నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితిలో భర్త ఉన్నాడు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

0 Comments