దేశ వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేతదారులపై ప్రభుత్వం కొరడా ఝుళిపించే
కార్యక్రమాన్ని పదును పెట్టింది.
వ్యాపారస్తులై ఉండి ప్రభుత్వానికి చెల్లించాల్సిన
జీఎస్టీ బకాయిలు 5కోట్లు దాటి చెల్లించాల్సిన గడువుకంటే
3నెలలైతే వారిని ఏ క్షణమైనా అరెస్టు చేసే
అవకాశాలు ఉన్నాయి. ఇందులో నాన్ బెయిలబుల్ కేసు, 5ఏళ్ళ
5ఏళ్ళ వరకు జైలు శిక్ష పడుతుంది. ఇక
వివరాలలోకి వెలితే హైదరాబాద్ డైరెక్టర్ జనరల్ ఆఫ్
జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ)
అధికారులు 13.81కోట్ల జీఎస్టీని చెల్లించాల్సి ఉండగా ఇప్పటి
వరకు
చెల్లించలేదని హైదరాబాద్ శివారు శామీర్‌పేటలోని ప్రముఖ రిసార్టు సీఎండిని
ఇటువంటి కేసులోనే
అరెస్టు చేశారు. 2017 జూలైలో జీఎస్టీఅమలులోకి వచ్చినప్పటి నుండి
వినియోగదారుల వద్ద నుండి
రిసార్టు నిర్వాహకులు జీఎస్టీని వసూలు చేస్తున్నారు.ప్రతి నెల రిటర్నులతోపాటు ప్రభుత్వానికి ఆ మొత్తాన్న
బదలాయించాల్సి ఉండగా
ఎగవేస్తు వస్తున్నారు.
రిసార్టు యాజమాన్యం జీఎస్టీని బదలాయించకుండా తమ వద్దే
పెట్టుకుందని తెలిసింది. రిసార్టుకు
చెందిన ఐదు బ్యాంక్ ఖాతాలను జప్తు చేసినట్లు, మొత్తం 13.81కోట్ల పన్ను ఎగవేతలో 2.27కోట్లను
ఇది వరకే రిసార్టు నిర్వాహకులుచెల్లించారని డీజీజీఐ వివరించారు. రిసార్టు సీఎండీ తమ దర్యాప్తు
బృందానికి
సహకరించడం లేదని,
దీంతో ఆయన్నుఅరెస్టు చేసి ఈ నెల18వరకు రిమాండ్‌కు
పంపినట్లు తెలిపారు.

0 Comments