కేంద్రంలోని మోది ప్రభుత్వం చేపట్టిన పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జిఎస్టీ) విధానం భారత ఆర్థిక
ప్రగతికి గండి కొట్టాయని స్వయంగా ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక
ప్రగతి నివేదికలో వెల్లడించింది. 2018లో చైనా ఆర్థిక అభివృద్ది రేటు 6.5శాతం ఉంటుందని, భారత్ 7.3శాతం వృద్ది రేటు సాధిస్తుందని ప్రపంచ
బ్యాంక్ అంచనా వేసింది.
కానీ ఈ అంచనాలను తల కిందులు చేస్తూ భారత్ 6.7శాతం వద్దనే చతికిల పడగా, చైనా మాత్రం అంచనాలకు మించి 6.9శాతం వృద్ది రేటును నమోదు చేసుకుంది. భారత
ఆర్థిక ప్రగతి మందగించడానికి ప్రధాన కారణం నోట్ల రద్దు, జీఎస్టీ అమలు అని నివేదికలో స్పష్టం చేసింది.
ఆర్థిక సంవత్సరానికి భారత్ స్థూల దేశీయ ఉత్పాదకత(జీఎస్టీ) 7.3శాతం వృద్ది రేటును నమోదు చేస్తుందని ప్రపంచ
బ్యాంక్ అంచనా వేస్తుంది. రానున్న రెండు సంవత్సరాలలో ఇది 7.5శాతానికి ఎగబాకే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ
బ్యాంక్ తన ముందస్తు అంచనాల్లో వెల్లడించింది.
చైనా ఆర్థిక ప్రగతి 2019, 2020లో 6.2శాతం 2021లో 6 శాతం మేర నమోదు చేసుకుంటుందని అంచనా
వేసింది. ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ దూసుకుపోతుందని
ప్రపంచ బ్యాంక్ వ్యాఖ్యానించింది. ఇప్పుడు కూడా భారత్ వేగంగా అభివృద్ది
చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థేనని ప్రపంచ బ్యాంక్ ప్రొస్పెక్టస్ గ్రూప్ డైరెక్టర్
అయిహాన్ కోస్ వెల్లడించడం భారత ఆర్థిక వ్యవస్థ వృద్దిరేటుపై ప్రపంచ బ్యాంక్‌కున్న
నమ్మకంగా చెప్పవచ్చు.

0 Comments