తెలంగాణలో విజయ హంగామ కొనసాగుతుంది. ఇప్పటికే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల్లో డైలమా
కొనసాగుతున్నా మరోవైపు హంగ్ వస్తే ఏర్పాటికి మద్దతు ఇవ్వాలనే తర్జన బర్జన
జరుగుతుంది.
ప్రధాన పార్టీలకు చెందిన అధినేతలు గంభీరంగా ప్రకటనలు చేస్తున్నా
నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల సరళిని అంచనావేస్తు లోలోన మదన పడుతున్నారు.
రాష్ట్రంలో ఓటర్లు చైతన్య వంతులవడంతో రాజకీయ నాయకులు ఓటర్ నాడి పట్టుకోవడంలో
విఫలం అయ్యారని చెప్పక తప్పదు. మరోవైను ఎగ్జిట్ పోల్ సర్వేలు వెలువడినా అన్ని
పార్టీల అభ్యర్థులకు ఓటు పోటు పడనుంది అనే విదంగా అంచనాలు వేసి విడుదల చేశారే తప్ప
స్పష్టమైన సర్వేలు మాత్రం విడుదల చేయలేక పోయాయి. ఈ పరిణామాలు కూడా అన్ని రాజకీయ
పార్టీలకు మింగుడు పడని విధంగా ఉంది. రాష్ట్రంలో హంగ్ వస్తే ఎవరికి మద్దతు
ఇవ్వాలనే మీ మాంసలో కొట్టుమిట్టాడుతున్నాయి. మరోవైపు పార్టీ ఆధినాయకులు బేరీజు
వేసుకుంటున్నారు. ఎన్నికల్లో పోటి చేసిన అభ్యర్థులు తమ భవిష్యత్తు ఈవిఎంలలో
భద్రంగా ఉన్నాయని అవి తెరిస్తే గాని అసలు విషయం బయట పడదంటు చెప్పుకొస్తున్నారు.
ఏది ఏమైనా ఓట్ల కౌంటింగ్ పూర్తయితే గాని తెలియదు ఓటర్లు ఎవరికి ఓటు వేసారు.
ఎవరికి పోటు వేశారు.

0 Comments