ప్రధాని మోది విధానాలకు వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షపార్టీలు కేంద్ర
ప్రభుత్వంతో అమీతుమికి సిద్దపడుతున్నాయి. ఢిల్లీలో సమావేశమై భాజపాకు వ్యతిరేకంగా
కార్యచరణను రూపొందిస్తున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి
ఫలితాలు వెలువడడమే తరువాయి. ఇప్పటికే బిజెపికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న
సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక బిజెపికి వ్యతిరేకిస్తున్న పార్టీలన్ని ఏకతాటిపైకి
వచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో దాదాపు 20పార్టీల నేతలు సమావేశమై కార్యచరణను
సిద్దమవుతున్న అంశం చర్చనీయాంశంగా మారింది. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మోదిని గద్దె
దించాలనే ఏకైక ఎజెండాతోనే ఎకతాటిపైకి వస్తున్నట్లు తెలుస్తొంది. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి
నారా చంద్రబాబునాయుడు సమావేశాన్ని సమన్వయ పరుస్తూ సమర్ధవంతంగా నిర్వహించనున్నారు.
సమావేశంలో ప్రధానంగా వివిధ పార్టీలకు చెందిన నేతల ఆలోచనలు పంచుకొని భవిష్యత్తు
కార్యచరణను ఖరారు చేస్తూనే జాతీయ స్థాయిలో ఎలా పనిచేయాలి, వారివారి రాష్ట్రాల్లో ఎలా వ్యవహరించాలనే అంశాలపై
దిశా నిర్ధేశ్యం చేయనున్నట్లు తెలుస్తొంది. ప్రధానంగా రాఫెల్ కుంభకోణం, రైతాంగ సమస్యలు, పెద్దనోట్ల రద్దు, నిరుద్యోగం, జిఎస్‌టి, చమురు ధరలు, రాజకీయ ప్రత్యర్ధులపై ఈడి, ఐటీ దాడులు వంటి ప్రధాన అంశాలను ఎజెండాలో
చేర్చి శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఏక స్వరంతో
ఎండగట్టడానికి ఒక అవగాహనకు రానున్నట్లు సమాచారం.

0 Comments