మహిళలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అకౌంట్లో డబ్బు జమ

మహిళలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అకౌంట్లో డబ్బు జమ


ఏపీలో డ్వాక్రా మహిళలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద రూ.1,109 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం అకౌంట్లలో జమ చేసింది. వరుసగా రెండో ఏడాది ఈ పథకం కింద నగదును తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్‌ బటన్ నొక్కి ప్రారంభించారు. మొత్తం 9.35 లక్షల సంఘాల్లోని 1.02 కోట్ల మంది మహిళల ఖాతాల్లో జమ చేశారు. 2020-21 ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు రూ.862.87 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.246.15 కోట్ల మేర వడ్డీ రాయితీని చెల్లించారు.
Telugu Friendship Quotes Whatsapp Status Photos Free Download

మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. రాష్ట్రంలో అక్కాచెల్లెమ్మలకు అండగా నిలబడ్డామన్నారు. మహిళా సాధికారితను ఆచరణలోకి తీసుకురాగలిగామని.. బ్యాంకుల ద్వారా నేరుగా సున్నా వడ్డీకే రుణాలు అందిస్తున్నామన్నారు. మహిళల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని.. వారి ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నామన్నారు. మహిళా సాధికారత నినాదం కాదు.. తమ విధానం అన్నారు. గత ప్రభుత్వం రుణాల పేరుతో మహిళలను మోసం చేసిందన్నారు
Jr NTR Emotional Whatsapp Status Message To Fans Free Download

దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా.. మహిళలకు 50 శాతం నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చేలా చట్టం చేశామని జగన్ గుర్తు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. మహిళల రక్షణ కోసం ఎక్కడా రాజీ లేదన్నారు.రాష్ట్రంలో 18 దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. మహిళల కేసులు వాదించేందుకు ప్రత్యేక పీపీలను నియమించామన్నారు. మద్యం నియంత్రణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.

 MegaStar Chiranjeevi's Acharya​ Laahe Laahe Song Lyrics in Telugu
బ్యాంకుల నుంచి రుణం తీసుకుని సకాలంలో కిస్తీలు చెల్లించిన డ్వాక్రా మహిళలకు ఆ రుణంపై వడ్డీ మొత్తాన్ని వైఎస్సార్‌ సున్నా వడ్డీ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 9,34,852 పొదుపు సంఘాలకు సంబంధించి 1.02 కోట్ల మంది మహిళలు బ్యాంకుల నుంచి రూ.19,989 కోట్ల రుణాలు తీసుకుని నిబంధనల ప్రకారం కిస్తీలు చెల్లించారు. గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఆయా సంఘాలు సకాలంలో బ్యాంకులకు చెల్లించిన రుణాలపై రూ.1,109 కోట్ల మేర వడ్డీ ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రతి ఊరిలో గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించింది.

Post a Comment

0 Comments