శ్రీరాముడు కోసల దేశాధీశ్వరుడైన దశరథునకు కౌల్య గర్భమును చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నాలుగో పాదాన కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పుట్టాడు.అందువలన ప్రతీ సంవత్సం చైత్రశుద్ద నవమి రోజున శ్రీరామజయంతి వేడుకగా జరుపుకుంటాం. ఆంధ్రప్రదేశ్ లో శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం జరపడం అనాదిగా ఆచారంగా వస్తున్నది.
Bhagwat Geeta Telugu Whatsapp Status Photos | Lord Krishna Message To Arjuna | Free Download
రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ద వరాలు పొంది దేవతలను జయించి మునులను వేధిస్తుంటారు. అతనికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్ధనలు మన్నించి శ్రీమహా విష్ణువు అతనిని సంహరించడానికి నరుడై జన్మింపనెంచాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్ముణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్ర్నలుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరిగారు.
ఒక రోజు పార్వతీ దేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం' అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి పరమేశ్వరుడు, ‘ఓ పార్వతీ!నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా! ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసన చేసాడు.
Friendship Quotes Whatsapp Status in Telugu - Telugu Friendship Quotations - Free Download
శ్లో|| శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే || ఈ శ్లోకం మూడు సార్లు స్మరించితే చాలు ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకురుడే ఈ తారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి వారి సథ్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.
భద్రాచలంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేషప్రజానీకం వస్తారు. రాష్టప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టువస్త్రాలు, పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది.
0 Comments