నేడే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు, మీరు తెలుసుకోవాల్సిన అంశాలు

నేడే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు, మీరు తెలుసుకోవాల్సిన అంశాలు

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరపున ముగ్గురు అభ్యర్ధులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు.


Nizamabad MLC ByPolls: నేడే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు, మీరు తెలుసుకోవాల్సిన అంశాలు– News18 Telugu

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఎన్నికల అబ్జర్వర్ వీరబ్రహ్మయ్య, IAS, జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ ఎన్నికల మెటీరియల్, మెన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. మెటీరియల్ ఏమీ మిస్ కాకుండా తీసుకోవాలని, ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఎన్నికల నిబంధనలతో పాటుగా కోవిడ్ కు సంబంధించిన నిబంధనలు కూడా పాటించేందుకు అనుగుణంగా మెటీరియల్ ఇస్తున్నామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ కు 4 పీపీఈ కిట్స్ ఇస్తున్నామని, ఓటరుకు సపరేట్‌గా పీపీఈ కిట్స్ ఇస్తున్నామన్నారు. ప్రతి పోలింగ్ ఆఫీసర్ తప్పకుండా మాస్క్, గ్లౌజ్, ఫేస్ షీల్డ్ ధరించాలని, పోలింగ్ స్టేషన్ కు 10 చొప్పున శానిటైజర్లు ఇస్తున్నామన్నారు. హెల్ప్ డెస్క్ వద్ద, వెయిటింగ్ హాల్లో శానిటైజర్లు పెట్టాలని, కోవిడ్ కు సంబంధించిన ఫ్లెక్సీలు ప్రతి పోలింగ్ స్టేషన్ ముందు ఓటు వేయడానికి వచ్చిన వారికి కనిపించేవిధంగా కట్టించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ ఆఫీసర్ కు గాని, సిబ్బందికి, ఓటరుకు గాని కోవిడ్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.

ఎన్నిక బ్యాలెట్ పేపర్ తో జరుగుతుందని, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చిన పెన్నుతో మాత్రమే వోట్ వేయాలని, వేరే పెన్నుతో వేస్తే ఓటు చెల్లదని స్పష్టం చేశారు. ఐడెంటిఫైయింగ్ అధికారిగా ఎంపీడీవో / మున్సిపల్ కమిషనర్ ఉంటారన్నారు. సెక్టోరల్ ఆఫీసర్ ఎంపీడీవోల డౌట్లు క్లియర్ చేయాలన్నారు. సెల్ ఫోన్స్ పోలింగ్ కేంద్రం లోపలికి తేకూడదని, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. కొవిడ్ పాజిటివ్ ఉన్న వ్యక్తులకు ఎన్నికల కమిషన్ రెండు రకాల ఆప్షన్స్ ఇచ్చిందని, వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా లేదా సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో నేరుగా ఓటు వినియోగించుకోవచననిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఎన్నికల అబ్జర్వర్ వీరబ్రహ్మయ్య, IAS, జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ ఎన్నికల మెటీరియల్, మెన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. మెటీరియల్ ఏమీ మిస్ కాకుండా తీసుకోవాలని, ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఎన్నికల నిబంధనలతో పాటుగా కోవిడ్ కు సంబంధించిన నిబంధనలు కూడా పాటించేందుకు అనుగుణంగా మెటీరియల్ ఇస్తున్నామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ కు 4 పీపీఈ కిట్స్ ఇస్తున్నామని, ఓటరుకు సపరేట్‌గా పీపీఈ కిట్స్ ఇస్తున్నామన్నారు. ప్రతి పోలింగ్ ఆఫీసర్ తప్పకుండా మాస్క్, గ్లౌజ్, ఫేస్ షీల్డ్ ధరించాలని, పోలింగ్ స్టేషన్ కు 10 చొప్పున శానిటైజర్లు ఇస్తున్నామన్నారు. హెల్ప్ డెస్క్ వద్ద, వెయిటింగ్ హాల్లో శానిటైజర్లు పెట్టాలని, కోవిడ్ కు సంబంధించిన ఫ్లెక్సీలు ప్రతి పోలింగ్ స్టేషన్ ముందు ఓటు వేయడానికి వచ్చిన వారికి కనిపించేవిధంగా కట్టించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ ఆఫీసర్ కు గాని, సిబ్బందికి, ఓటరుకు గాని కోవిడ్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.

ఎన్నిక బ్యాలెట్ పేపర్ తో జరుగుతుందని, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చిన పెన్నుతో మాత్రమే వోట్ వేయాలని, వేరే పెన్నుతో వేస్తే ఓటు చెల్లదని స్పష్టం చేశారు. ఐడెంటిఫైయింగ్ అధికారిగా ఎంపీడీవో / మున్సిపల్ కమిషనర్ ఉంటారన్నారు. సెక్టోరల్ ఆఫీసర్ ఎంపీడీవోల డౌట్లు క్లియర్ చేయాలన్నారు. సెల్ ఫోన్స్ పోలింగ్ కేంద్రం లోపలికి తేకూడదని, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. కొవిడ్ పాజిటివ్ ఉన్న వ్యక్తులకు ఎన్నికల కమిషన్ రెండు రకాల ఆప్షన్స్ ఇచ్చిందని, వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా లేదా సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో నేరుగా ఓటు వినియోగించుకోవచన్నారు.

Post a Comment

0 Comments