ఏపీలో మరో పథకాన్ని ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి డ్వాక్రా మహిళలకు ఆర్థిక చేయతూ ఇచ్చే వైఎస్సార్ ఆసరా పథకాన్ని తీసుకొస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. చెప్పినట్లుగానే ఇవాళ వైఎస్సాఆర్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్ ఆసరా’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పథకం కింద 8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.27,168.83 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో నేరుగా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేయనుంది. తొలి విడతలో రూ.6,792.20 కోట్లను ఇవాళ డ్వాక్రా సంఘాల ఖాతాల్లో జమ చేశారు. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలన్న నిర్ణయాన్ని డ్వాక్రా మహిళలకే వదిలేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకర్లు ఆ డబ్బును పాత అప్పులకు మినహాయించుకోకూడదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
వైఎస్సార్ ఆసరా పథకం లబ్ధిదారుల పేర్లను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. అర్హత ఉన్నప్పటికీ జాబితాల్లో పేర్లు లేని సంఘాలు ఏవైనా ఉంటే.. వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వాటిపై విచారణ చేసి ఆసరా డబ్బులను మంజూరు చేస్తామని వెల్లడించారు. డబ్బులను పాత బాకీల కింద జమ చేసుకోకుండా ఇప్పటికే బ్యాంకర్లతో మాట్లాడామని తెలిపింది. ఈ క్రమంలోనే ఆ మొత్తాన్ని అన్ ఇన్‌కమ్‌బర్డ్ ఖాతాల్లో జమచేశారు. ఆ డబ్బులతో వ్యాపారం చేయాలనుకునే మహిళలకు ప్రభుత్వ అన్ని విధాలుగా సహాయసహకారాలు అందజేస్తామని అధికారులు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.
0 Comments