ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం జగన్‌.

ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం జగన్‌.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉన్నందున ప్రధాని మోదీ కోవిడ్‌పై బుధవారం వివిధ రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన ,వీడియో కాన్ఫరెన్స్‌ లో తొలుత మాట్లాడే అవకాశాన్ని తనకు కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధన్యవాదాలు తెలియచేశారు. తిరుమల అన్నమయ్య భవనం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రంలో కోవిడ్‌–19 నివారణకు తీసుకుంటున్న చర్యలను తెలియ చేశారు. ఆ వివరాలివీ..

ఇలాంటి విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్న మీ (ప్రధాని మోదీ) నాయకత్వాన్ని అభినందిస్తున్నా. ప్రపంచంలోనే అతి తక్కువ మరణాలు దేశంలో నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సూచనలను పాటిస్తూ కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారిని త్వరగా గుర్తించి చికిత్స అందించడం ద్వారా మరణాల సంఖ్యను ఏపీలో బాగా తగ్గించగలిగాం.
► విపత్కర పరిస్థితులను సవాల్‌గా స్వీకరించి వైద్య రంగంలో మౌలిక వసతులను గ్రామీణ స్థాయి దాకా మెరుగు పరుస్తున్నాం. ఆర్థికంగా దెబ్బతిన్న ప్రజలను ఆదుకునేందుకు పలు సంక్షేమ, పునర్జీవన పథకాలను అమలు చేస్తూ సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని అడ్డుకున్నాం.

Post a Comment

0 Comments