రైతు వేదిక  పనుల పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ 

రైతు వేదిక  పనుల పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ 

(చట్టం -బోధన్/ సురేందర్) బోధన్ మండలం సాలూరు గ్రామంలో కొనసాగుతున్న రైతు వేదిక పనులను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. సాలూరు గ్రామంలోని పలు ప్రభుత్వ పథకాలు పరిశీలించడం జరిగింది రైతు వేదిక పనులు వేగిరం జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో 105 రైతు వేదిక నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ నెల 30వ తేదీ లోపు పనులు పూర్తి అయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. సాలూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు పాలకులు అధికారులు చేసిన కృషి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 30 తేదీ లోపు రైతు వేదిక పనులు పూర్తి చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం మాజీ  మండల రైతు సమన్వయ సమితి మండల్  అధ్యక్షులు బుద్దె  రాజేశ్వర్ మాట్లాడుతూ..  దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు సమావేశాలు జరగడం కోసం రైతు వేదిక నిర్మాణ పనులు చేయడం సంతోషదాయకమన్నారు.

ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రైతు వేదిక ల నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి కావడం కొరకు  శాసనసభ్యులు ఎండి.షకిల్  సహాయ సహాయసహకారాలు అందిస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు.  కెటిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ  గ్రామ సర్పంచ్ చంద్రకళ,రాజప్ప, పిఎసిఎస్ చైర్మేన్ శివకాంత్ పటేల్, రాజేశ్వర్ ఎంపిటిసికండేల.సవితాసంజీవ్,సురేష్ ,ఎంపీటీసీ సవిత,  తాశీల్దార్ గఫార్ మియా పంచాయతీరాజ్  డిఈ భావాన్న, ఏఈ కిషన్  ,ఉప సర్పంచ్ డిస్కో సాయిలు,  ఖదీర్  గ్రామస్తులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments