(చట్టం -నరసరావుపేట) నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నరసరావుపేట నియెజకవర్గ అధ్యక్షుని గా కందుల అనిల్ కుమార్ నియమిస్తున్న ట్లు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బండి సురేంద్ర బుధవారం తెలిపారు. పత్రిక రంగంలో తనకంటూ ప్రత్యేక మైన ముద్ర కల్గిన వ్యక్తి అనిల్ కుమార్ ,నరసరావుపేట మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నడు . ఈ సందర్భంగా నరసరావుపేట నియెజకవర్గ అధ్యక్షుని నూతనంగా ఎన్నికయిన అనిల్ కుమార్ మాట్లాడుతూ.. నాపై గౌరవం,నమ్మకం ఉంచి నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ లో నరసరావుపేట నియెజకవర్గ అధ్యక్షుడు గా బాధ్యతలు ఇచ్చిన యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు బి.సురేంద్ర బాబు,నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బండి.శివకి ,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందిగం సుదీర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పరిష్కరించేలా,జర్నలిస్ట్ ల సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలలో ముందు ఉండి యూనియన్ తరపున సలహాలు ,సూచనలు చేస్తూ యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. నియెజకవర్గంలో జరుగుతున్న జర్నలిస్టుల సమస్యలను అధికారులు,ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అనిల్ కుమార్ తెలిపారు.


0 Comments