ఒకే వారంలో రెండు పురస్కారాలు

ఒకే వారంలో రెండు పురస్కారాలు

నిజామాబాద్‌ (‌చట్టం) : నిజామాబాద్‌ ‌జిల్లా వర్ని పోలీస్‌ ‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులునిర్వహిస్తున్న తొగర్ల సురేష్‌కు ఒకే వారంలో రెండు పురస్కారాలు వరించాయి. వివిధ రంగాలలో, సమాజిక సేవలు అందించినందుకు గాను నల్లగొండలోని పుడమి సాహిత్య వేదిక వారు పుడమి సాహితీ అవార్డును ప్రకటించారు. ఆగస్టు 5న అవార్డు ప్రధానం చేయడానికి ఏఎస్‌ఐ ‌సురేష్‌కు ఆహ్వానం పంపించారని సురేష్‌ ‌తెలిపారు. అదే విధంగా 2020 ఫిబ్రవరిలో సుందరాచారి స్మారక పురస్కారాలకు రెండు తెలుగు రాష్ట్రాల కవులు, రచయితల నుండి పుస్తకాలు ఆహ్వానించగా సురేష్‌ ‌రాసిన కోమలి (కవిత్వం) పంపగా అనుహ్య స్పందన లభించింది. కోమలి కవిత్వంకు ఎంపిక చేసి సుందరాచారి స్మారక పురస్కారాన్ని కరోనా కారణంగా పురస్కారం అందించడంలో జాప్యం జరగగా దీనిని సైతం ఇదే వారంలో అందజేశారు. దీంతో ఒకే వారంలో రెండు పురస్కారాలు అందుకున్నారు. నిజామాబాద్‌ ‌జిల్లా కేంద్రం కోటగల్లికి చెందిన తొగర్ల సురేష్‌ 13.02.1968‌న సుశీల-సాయన్న దంపతులకు జన్మించారు. వృత్తిరిత్యా పోలీస్‌ ‌శాఖలో విధులు నిర్వహిస్తూ సాహిత్యం, కథలు రాస్తూ స్వంతంగా పుస్తకాలను అచ్చువేయిస్తున్నారు.

Post a Comment

0 Comments