ఏపీలోని అనేక వర్గాల కోసం అనేక పథకాలు తీసుకొస్తున్న వైసీపీ ప్రభుత్వం.. తాజాగా అందరికీ సామాజిక భద్రత కల్పించేందుకు వైఎస్ఆర్ బీమా పథకం తీసుకొచ్చింది. ఈ పథకం విధివిధానాలపై చర్చించి ఆమోదముద్ర వేసింది.ఈ పథకం కింది ఓ వ్యక్తి సహజంగా చనిపోతే అతడి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం లభిస్తుంది. శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు వస్తాయి.
18–50 ఏళ్ల మధ్య వర్తింపు వయసున్న వారికి ఇది వర్తిస్తుంది. 51–70 ఏళ్ల మధ్య వయసున్న వారి కోసం మరో నిబంధన తీసుకొచ్చారు.ఆ వయసు వారికి శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.3 లక్షలు లభించనున్నాయి.బియ్యం కార్డు ఉండి, కుటుంబం ఆధారపడ్డ వ్యక్తికి దురదష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే ఈ వైఎస్ఆర్ బీమా వర్తిస్తుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సుమారు కోటి 50 లక్షల బియ్యం కార్డు గల కుటుంబాలు ఉన్నాయి.
దీంతో ఈ బీమా పథకం ద్వారా ఎక్కువ మందికి వర్తించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్‌ఐసి, కేంద్ర ప్రభుత్వం గత పథకాన్ని ఉపసంహరించిన నేపథ్యంలో ఈ కొత్త పథకాన్ని ఏపీ ప్రభుత్వం సొంత ఖర్చుతో తీసుకొచ్చింది. ఇందుకోసం ఏడాదికి రూ.583.5 కోట్లు ఖర్చు చేయనుంది.

0 Comments