ఫేస్ బుక్ పరిచయం ఇద్దరిని కటకటాల్లోకి నెట్టిందుకు కారణమైంది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్ పూర్ కు చెందిన అశ్వక్(24) అనే యువకుడికి, ఫేస్ బుక్ లో ఉత్తరప్రదేశ్ లోని మురాలాబాద్ జిల్లాకు చెందిన వివాహిత(28)తో పరిచయం ఏర్పడింది. మొదట ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. యువకుడు పలుమార్లు ఉత్తరప్రదేశ్ లోని వివాహిత ఉండే ప్రాంతానికి వెళ్లి కలిశాడు. అయితే తనను శాశ్వతంగా తీసుకెళ్లాలని వివాహిత కోరింది. దీంతో ఆ యువకుడు రెంజల్ మండలం కందకుర్తి కి చెందిన కారును అద్దెకు తీసుకుని ఈనెల 5న మహిళ ఉండే ప్రాంతానికి వెళ్ళాడు. అయితే కలిసి జీవించేందుకు అవసరమైన డబ్బు గురించి ఇద్దరి మధ్య చర్చ వచ్చింది.
ఈ క్రమంలో తన కొడుకు ను కిడ్నప్ చేసి భర్తను డబ్బులు డిమాండ్ చేయమని ఆ మహిళ యువకుడికి సూచించింది. ఈ మేరకు ఆమె కుమారుడిని కిడ్నాప్ చేసి 40కి.మీ.ల దూరం ప్రయాణించి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. మహిళ భర్త పోలీసులను ఆశ్రయించగా... విషయం మహిళ ద్వారా తెలుసుకున్న యువకుడు బాలుడ్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. కొన్ని రోజుల కింద ఇంటికి చేరుకోగా... ఫోన్ నంబర్ ఆధారంగా యూపీ పోలీసులు యువకుడి అడ్రస్ గుర్తించారు. స్థానిక పోలీసుల సహకారం తో యువకుడిని, కారు డ్రైవర్ ను అరెస్ట్ చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కోర్టు లో నిందితులను హాజరుపరిచి యూపీ తీసుకెళ్లారు.
0 Comments