రైతు వేధిక భవనాలను సకాలంలో పూర్తి చేయాలి : కలెక్టర్‌ ‌శరత్‌

రైతు వేధిక భవనాలను సకాలంలో పూర్తి చేయాలి : కలెక్టర్‌ ‌శరత్‌


కామారెడ్డి (చట్టం) : రైతు వేదిక భవనాల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి, బ్రాహ్మణపల్లి, గాంధారి మండలం దుర్గం, గాంధారి లోని రైతు వేదికల భవనాల నిర్మాణం పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆగస్టు 15 లోగా భవనాల నిర్మాణం పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గుత్తేదారులు పనుల్లో జాప్యం చేస్తే బిల్లులు రావని సూచించారు. పనులు నాణ్యత గా జరిగే విధంగా చూడాలన్నారు. గ్రామాల్లో ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం వల్ల నూతన శోభ సంతరించుకోనున్నాయని పేర్కొన్నారు. డంపింగ్ యార్డులను పూర్తి చేసి సేంద్రియ ఎరువుల సంపద కేంద్రాలుగా మార్చాలని సూచించారు. అవెన్యూ ప్లాంటేషన్ పనులను ఈనెల 31లోగా పూర్తిచేయాలని సర్పంచులను కోరారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, పంచాయతీరాజ్ ఈ ఈ సిద్ధిరాములు, ఎంపీడీవోలు రవి, ఈశ్వర్ గౌడ్, లక్ష్మి, తాసిల్దార్ నాగరాజు గౌడ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments