(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) : భారత రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరించే చర్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే మానుకోవాలని పీ.డీ.ఎస్.యు, ఐ.ఎఫ్.టి.యు సంఘాలు డిమాండ్ చేసాయి.
ప్రైవేటికరించే ఆలోచనను మానుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కి డ్రాఫ్ట్ బాక్స్ ద్వారా మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు, ఐ.ఎఫ్.టి.యు నేతలు ఎస్.వి.శ్రీకాంత్, కొడారి యాదగిరిలు మాట్లాడుతూ పన్నెండు క్లస్టర్లలోని నూట తొమ్మిది మార్గాల్లో నూట యాబయోక్క ప్యాసింజర్ రైళ్లను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వబోతుందని దీనివల్ల లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని అన్నారు. రైళ్ల ఉత్పత్తి, నిర్వహణ, ఆహార పదార్థాల దిగుమతి, టికెట్ చార్జీల రేట్లు తదితర అంశాలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉంటాయని ఆరోపించారు. కాబట్టి ప్రజా రవాణా వ్యవస్థ అయిన రైల్వేను ప్రైవేటికరించే ఆలోచనలను మనుకోవకాని లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీ.డీ.ఎస్.యు నేతలు విద్యానాథ్, ప్రశాంత్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

0 Comments