ఏపీలో కోవిడ్ కేసులు ఊహించని స్థాయిలో పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు 4 వేలకు పైగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఒక వైపు రాష్ట్రంలో భారీగా కరోనా టెస్టులు చేస్తూ, అనేక చర్యలు తీసుకుంటున్నా... ఈ మహమ్మారి నియంత్రణలోని రాకపోవడం ప్రభుత్వ వర్గాలను ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఏపీలో కొన్ని ప్రాంతాలు ఇప్పటికే స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. గుంటూరు, చిత్తూరు, తూర్పుగోదావరి లాంటి జిల్లాల్లో వ్యాపారస్థులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసి లాక్‌డౌన్ పాటిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆదివారం లాక్ డౌన్‌గా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఏపీలో లాక్‌డౌన్ విధించే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
గత వారం రోజులుగా ఏపీలో కోవిడ్ కేసుల వ్యాప్తి చూస్తుంటే రికవరీ రేటుతో పాటు డెత్‌రేట్ కూడా పెరుగుతోంది. ఇవే ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఒక్కసారిగా ఇలా భారీగా కేసులు పెరగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు అయితే గత కొద్ది రోజులుగా ఇతర రాష్ట్రాల నుంచి వలసలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వం అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి శాతం తక్కువగా ఉందని ప్రభుత్వ చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిల నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్‌కి వెళితే ఎలా ఉంటుందనే ఆలోచనలు ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది.

0 Comments