బంగాళాఖాతంలో చీలిక…సునామీ, భూకంపాలు వచ్చే…!!

బంగాళాఖాతంలో చీలిక…సునామీ, భూకంపాలు వచ్చే…!!

హైదరాబాద్ : బంగాళఖాతంలో చీలిక ఏర్పడిందని సముద్ర అధ్యయన జాతీయ సంస్థ మైదరాబాద్‌ ‌కేంద్ర విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు. సముద్రంలో 300కిలో మీటర్ల పొడవున లోతైన చీలిక ఏర్పడినట్లు తెలిసింది. ఈ చీలిక తూర్పు గోదావరి నుండి శ్రీకాకుళం జిల్లా వరకు తీరం పొడవునా ఉన్నట్లు గుర్తించారు. నదుల నుండి సముద్రాల్లోకి వెళ్లే రాళ్లు, మట్టి వల్ల ఏర్పడిన ఒత్తిడి కారణంగా సముద్రంలో చీలిక ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ చీలిక 100 మీటర్ల నుంచి 900 మీటర్ల వరకు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గోదావరి ప్రాణహిత గ్రాబెన్ నుంచి నాగావళి వంశధార షియర్‌జో వరకు దాదాపు 300కి.మీల దూరం భూమి చీలినట్లు శాస్త్రవేత్తలు నిర్దారించారు. అయితే ఈ చీలిక 16 మిలియన్ సంవత్సరాల కిందటే ఏర్పడిందని, కానీ కొత్తగా వచ్చి చేరే మట్టి, రాళ్ల కారణంగా ఇది మరింత పెరుగుతుందని తెలిపారు. ఈ చీలిక కారణంగా భవిష్యత్తులో సునామీలు, భూ కంపాలు వచ్చే అవకాశమున్నట్టు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ముప్పు ఉన్నట్టు విశ్లేషిస్తున్నారు.

Post a Comment

0 Comments