కరోనా అంతం కావాలని శ్రీమహాలక్ష్మీ అమ్మవారిని వేడుకున్న పద్మశాలి 46వ తర్ప అధ్యక్షుడు గెజ్జెటి నర్సయ్య

కరోనా అంతం కావాలని శ్రీమహాలక్ష్మీ అమ్మవారిని వేడుకున్న పద్మశాలి 46వ తర్ప అధ్యక్షుడు గెజ్జెటి నర్సయ్య

నిజామాబాద్‌ (‌చట్టం) : నిజామాబాదు నగరంలోని వినాయక నగర్ లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి శ్రీ మహాలక్ష్మి పద్మశాలి సంఘం 46వ తర్ప అధ్యక్షులు గుజ్జెటి వెంకట్ నర్సయ్య ఆధ్వర్యములో ఘనంగా పూజలు చేశారు. ప్రజలు తొందరగా కరోనా మహమ్మారి నుండి విముక్తులు కావాలని కరోనా పూర్తిగా అంతం కావాలని అమ్మవారిని మొక్కుకున్నట్టు గుజ్జేటి వెంకట నర్సయ్య చెప్పారు. ఈ సందర్భంగా అమ్మవారికి సంఘ సభ్యులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సంఘం ఆవరణలో హరితహారము కార్యక్రమములో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి పద్మశాలి సంఘం ప్రధానకార్యదర్శి కొండ గంగాచరణ్, కోశాధికారి తాటిపాముల శ్యామ్, ఇంజపురి మధుసూదన్, వల్లకాటి రవీందర్, రమేష్, శ్రీకాంత్, ప్రకాష్ తులాసీదాస్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments