సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశారు.. గోల్డ్ మెడల్ సంపాదించారు. తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఇక చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో జెడ్పీ ఛైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది.
ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో ఎవరికి ఆ బాధ్యతలు అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. బోస్ సీనియర్ కావడంతో.. మళ్లీ సీనియర్ నేతకే అవకాశం కల్పిస్తారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రోడ్లు భవనాల మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే ప్రచారం నడుస్తోంది.
0 Comments