పట్టణ కాంగ్రెస్ కమీటీ కార్యదర్శిగా నియామక పత్రాన్ని అందజేసిన పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రభాకర్ వర్మ

పట్టణ కాంగ్రెస్ కమీటీ కార్యదర్శిగా నియామక పత్రాన్ని అందజేసిన పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రభాకర్ వర్మ


(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) : పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రభాకర్ వర్మ, పిసిసి అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ చేతుల మీదుగా మైనార్టీ విభాగానికి చెందిన మహమ్మద్ కమర్ పాషాను పట్టణ కాంగ్రెస్ కమీటీ కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అం‌దజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలో మైనారిటీలకు అందుబాటులో ఉండి కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు సేవలు అందించాలని కోరినారు. మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలను టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ఎప్పటికప్పుడు కార్యక్రమాలు మైనార్టీల పక్షాన పోరాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి మైనార్టీల పక్షాన యువత ముందుండి నడిచేలా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉందని సూచించారు. అనంతరం ఖమర్ పాషా మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి సహకరించిన ప్రభాకర్ వర్మకి, టిపిసిసి అధికార ప్రతినిధి హరిక్రిష్ణకి, డిసిసి అధ్యక్షుడు రాష్ట్ర మైనారిటీ నాయకులు వహీద్ ఖాన్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మార్క సతీష్ కుమార్, జిల్లా మైనారిటీ రాష్ట్ర నాయకులు కరీముద్దీన్, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్మత్ నర్సింగ్ యాదవ్ అందరికీ కృతజ్ఞతలు తెలియ జేశారు.

Post a Comment

0 Comments