(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) : కవిత, పద్యం, గేయం పలు పక్రియలలో ఉత్తమ రచనలు చేసినందుకు గాను నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామానికి చెందిన కవి ఉండ్రాళ్ళ రాజేశం మెతుకుసీమ సాహితీ పురస్కారానికి ఎంపిక చేసినట్లు మెతుకుసీమ సాహిత్య సాంస్కృతిక సంస్థ అద్యక్షులు పూసల లింగాగౌడ్, ప్రధాన కార్యదర్శి అవుసుల భానుప్రకాష్ లు తెలిపారు. దత్తపది, సమస్య, చిత్రం తదితర అంశాలపై ఆటవెలది, కందం, సీస పద్యాలతో రచనలు చేస్తూ సమాజహితమైన సాహిత్యంతో రాజేశం ముందుకు సాగుతున్నారు. ఎన్నో సాహిత్య పురస్కారాలు అందుకున్న కవి ఉండ్రాళ్ళ రాజేశం మెతుకు సీమ సాహితీ పురస్కారం మరింత బాధ్యత పెంచిందని అన్నారు.

0 Comments