మాస్కులు లేకుండా తిరిగితే జరిమాన

మాస్కులు లేకుండా తిరిగితే జరిమాన


కామారెడ్డి (చట్టం) : నసురుల్లాబాద్‌ ‌మండల పరిషత్‌ ‌కార్యాలయం వద్ద మాస్కులు ధరించకుండా రోడ్లపై తిరిగే వారికి జరిమానాలు విధించారు పోలీసులు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు జరిమానాలు విధించడం జరుగుందని సూచించారు. మాస్కులు లేకుండా ఎవరైనా రోడ్లపై తిరిగితే జరిమానాలు విధించడం జరుగుతుందని, అదే విధంగా దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించాలని అన్నారు. దీనికై రెవెన్యూ, ఎంపిడిఓ, పోలీస్‌ ‌శాఖతో కలిసి మండల కమిటి ఏర్పాటు చేశారు. కమిటీలో సర్పంచ్‌తోపాటు గ్రామ కార్యదర్శి కూడా ఉంటారు. జరిమానాలను కమిటీలో సర్పంచ్‌, ‌సెక్రటరీ, విఆర్‌ఓ, ఆశా వర్కర్స్ ఎవరైనా వేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ రాము, ఆర్‌ఐ ‌పండరి, ఎస్‌.ఐ ‌సందీప్‌, ‌సీనియర్‌ అసిస్టెంట్‌ ‌రామారావు, విఆర్‌ఓ ‌సందీప్‌ ‌వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments