ఏపిలో కరోనాతో 62మంది మృతి

ఏపిలో కరోనాతో 62మంది మృతి


హైదరాబాద్‌ (‌చట్టం) : ఏపీలో కరోనా ఉదృతి ఏమాత్రం ఆగ‌టం లేదు. ఓవైపు అత్య‌ధిక టెస్టులు జ‌రుగుతున్న వైర‌స్ వ్యాప్తి ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఈరోజు ఏకంగా 62మంది మ‌ర‌ణించారు. తాజాగా గ‌డిని 24గంట‌ల్లో ఏపీలో ఏకంగా 4944కేసులు రాగా,  దీంతో ఏపీలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 58,668కి చేర‌గా, 32,336మంది చికిత్స పొందుతున్నారు. 25,574మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా క‌రోనాతో ఇప్ప‌టి వ‌ర‌కు 758మంది మ‌ర‌ణించారు. తాజాగా 37,162శాంపిల్స్ ప‌రీక్షించిన‌ట్లు ఏపీ వైద్యారోగ్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. కొత్తగా మ‌ర‌ణించిన వారు తూ.గో 10మంది, విశాఖ‌లో 9, చిత్తూరు 8, శ్రీ‌కాకుళం 7, అనంత‌పురం 6, ప్ర‌కాశం, గుంటూరు 5, క‌ర్నూలు 4, క‌డ‌ప‌లో ఒక‌రు మ‌ర‌ణించిన‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన 758మందిలో అంద‌రూ ఏపీలో వైర‌స్ బారిన ప‌డ్డ వారేన‌ని, ఇత‌ర రాష్ట్రాలు, దేశాల నుండి వ‌చ్చిన వారిలో వైర‌స్ నిర్ధార‌ణ అయిన‌ప్ప‌టికీ ఎవ‌రూ మ‌ర‌ణించ‌లేద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

Post a Comment

0 Comments