మెదక్ జిల్లా నర్సాపూర్‌లో హరిత హారం ఆరో దశను ప్రారంభించిన సీఎం కేసీఆర్.. మనం కోల్పోయిన అడవిని తిరిగి రప్పించాలన్నారు. ఇందుకోసం పట్టుదలతో పని చేయాలన్నారు. మన దేశంలో ప్రతి గ్రామంలో నర్సరీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణకు మంచి భవిష్యత్ ఉందన్న సీఎం.. మొక్కలను పెంచడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. ఇందు కోసం గ్రామస్థులే కథనాయకులు కావాలి. కలెక్టర్లు నరసింహావతారం ఎత్తాలన్నారు. ప్రతి గ్రామంలో చెట్లను పెంచాలన్న సీఎం.. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో మొక్కలు పెంచే బాధ్యతను అందరూ తీసుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
నేను స్వయంగా కారు నడుపుకొంటూ తిరిగిన రోడ్డు ఇది. ఎమ్మెల్యే అయిన కొత్తలో ఫియట్ కారును నేనే నడుపుకొంటూ తిరిగే వాణ్ని. 1980ల్లో సినిమా వాళ్లకు అడవిలో షూటింగ్ కావాలంటే నర్సాపూర్ వచ్చేవాళ్లు. మనం చూస్తుండగానే అడవి మొత్తం మాయమై.. ఉష్ణోగ్రతలు 49 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకున్నాయి. ఎక్కడ వర్షం పడకున్నా.. నర్సాపూర్‌లో వానలు పడేవి. కానీ అడవులను మనం నాశనం చేసుకున్నాం. మళ్లీ మనమే ఆ అడవులకు మళ్లీ జీవం పోయాల’’ని కేసీఆర్ కోరారు.
‘‘నర్సాపూర్‌లో కోల్పోయిన అడవి 92 వేల ఎకరాలు. దాన్ని మళ్లీ బతికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అడవి లేని ప్రాంతంలోనూ కొత్తగా అడవిని సృష్టించాలి. మన ముందు ఎన్నో తరాలు శ్రమిస్తే.. ఈ స్థాయిలో ఉన్నాం. మనం కూడా భావితరాల కోసం పని చేయాలి. ప్రభుత్వం తాను చేయాల్సిన పనులన్నీ చేస్తుంద’’ని కేసీఆర్ తెలిపారు.

0 Comments