ఏపీ-తెలంగాణ‌ బస్సులపై సస్పెన్స్.. కానీ ఆ సర్వీసుల్ని నడపాలని ఆర్టీసీ నిర్ణయం

ఏపీ-తెలంగాణ‌ బస్సులపై సస్పెన్స్.. కానీ ఆ సర్వీసుల్ని నడపాలని ఆర్టీసీ నిర్ణయం

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులపై సందిగ్థత కొనసాగుతోంది. ఈ నెలాఖరు నుంచి బస్సులు నడపాలని భావించినా ఆ దిశగా అడుగులు పడలేదు. రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడటంతో పాటూ టీఎస్ ఆర్టీసీలో కరోనా కలకలంరేగడంతో పరిస్థితతులు మొత్తం మారిపోయాయి. దీంతో సర్వీసులు నడపటంపై మళ్లీ సస్పెన్స్ కొనసాగుతోంది.. పరిస్థితి చూస్తే ఇప్పట్లో బస్సులు మొదలయ్యే అవకాశం కనిపించడం లేదు.

వాస్తవానికి బుధవారం హైదరాబాద్‌లో అధికారుల మధ్య చర్చలు జరగాలి.. కానీ వాయిదా పడ్డాయి. అంతేకాదు రోజు రోజుకు కరోనా కేసులు పెరుగడటం, టీఎస్‌ఆర్టీసీలో ఆపరేషన్స్‌ విభాగంలో ఓ అధికారికి కరోనా పాజిటివ్‌ తేలడంతో చర్చల్ని వాయిదా వేశారు. ఈ నెల 17న విజయవాడలో ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ అధికారులు సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చించారు. రెండో సమావేశంలో క్లారిటీ వస్తుందని భావించారు.. కానీ సీన్ మొత్తం మారింది.

Post a Comment

0 Comments