రైతు బంధు పథకానికి దరఖాస్తు చేసుకోడానికి తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 2020 జనవరిలో కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన వారు, ఇంతకు ముందే పాస్ బుక్‌లు ఉన్నప్పటికీ.. రైతు బంధు పథకం కోసం దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు.. జూన్ 13లోగా దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ తెలిపింది. దరఖాస్తుతోపాటు భూమి పాస్ బుక్ జిరాక్స్, ఎమ్మార్వో డిజిటల్ సంతకం చేసిన పేపర్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ ఖాతా పాస్ బుక్ నకలు పత్రాలు సమర్పించాలని రైతులకు సూచించింది.
రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పిన పంటలు సాగు చేసిన వారికే రైతు బంధు పథకాన్ని వర్తింపజేసే యోచనలో ప్రభుత్వం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. దీంతో నియంత్రిత పంటల సాగు విషయంలో విపక్షాలు కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించాయి. రైతు బంధును అందరికీ అందజేస్తామని.. కొత్తగా పాస్ బుక్కులు పొందిన వారికి కూడా ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
0 Comments